మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన కలకోటి శ్రీనివాసరావు (54) పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతనెల 26వ తేదీన శ్రీనివాసరావు నివసించే ప్రక్క ఇంట్లో గొలుసు దొంగతనం జరిగిందని దొంగతనమే ఇతనే చేసాడని ఆరోపించడంతో అవమానం తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిట్ గుంటూరులోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మృతుని బావ సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa