ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురికి కాలువ నిర్మాణాన్ని పరిశీలిం చిన కమీషనర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 11:49 AM

గుంతకల్లు పట్టణంలోని ప్రధాన రహదారిలో వైఎస్ఆర్ విగ్రహం నుండి పాత బస్టాండు చింతమాను వరకు నిర్మాణంలో ఉన్న ప్రధాన మురికి కాలువ పనులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న బుధవారం క్షేత్ర స్థాయిలో వెళ్లి పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో వ్యాపార దుకాణా లకు వచ్చే ప్రజలు ఇబ్బందు పడు తున్నారని ప్రతిపక్ష కౌన్సిలర్లు నిల దీశారు. దీంతో కమీషనర్ ఇంజనీర్ల తో వెళ్లి పనులు పరిశీలించారు. కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని డిఇ హేమచంద్ర, ఏఈ శ్రీకాంత్ ను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com