విద్యార్తులను క్రమశిక్షణతో నడిపిస్తూ కళాశాల అభివృద్ధికి డాక్టర్ ఆర్. రామకృష్ణ నాయుడు(ఆర్కే నాయుడు)చేసిన సేవలను ఎనలేని వని వక్తలు అన్నారు. గుంతకల్లు పట్టణంలోని శ్రీ శంకరానంద గిరి స్వామి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. రామకృష్ణ నాయుడు మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ కళాశాల కరస్పాండెంట్ కేసి. హరికుమార్ కు అందజేశారు. దీంతో ఉప ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్ కు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా కేసి హరి కుమార్ బాధ్యతలు అప్పగించారు. తన పదవీకాలంలో అన్ని విధాలుగా సహకారం అందించిన అందరికి ఆర్కే నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు.