చిత్తూర్, వి.కోట, మండలంలోని పి.కొత్తూరులో దళితుల శ్మశానానికి దారి లేక పాడె మోసేందుకు బంధువులు నానాఅవస్థలు పడ్డారు. సోమవారం పి.కొత్తూరు గ్రామానికి చెందిన రమేష్ (55) అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామానికి సమీపంలో ఉన్న శ్మశానానికి చెరువు మీదుగా దారి ఉంది. ఇటీవల కురిసిన వానలకు చెరువు పూర్తిగా నిండటంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దారి లేక బంధువులు ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని నడుంలోతు నీళ్లలో తరలించారు. అలాగే మహిళలు, బంధువులు, డప్పు వాయిద్యకారులు సైతం నీటిలోనే నడిచి వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు.