గర్భిణీ పట్ల కర్ణాటకలోని తరుముకూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బుధవారం అమానవీయంగా ప్రవర్తించారు. ఆధార్ లేకపోవడంతో అడ్మిట్ చేసుకోలేమని వెనక్కి పంపేశారు. చేసేదేమీ లేక ప్రసవ వేదనతో కస్తూరి అనే పేద మహిళ చివరికి ఇంటికి వెళ్లిపోయింది. గురువారం కవలల్లో ఒకరిని ప్రసవించింది. మరొకరిని ప్రసవించేలోపే కన్నుమూసింది. ఇద్దరు పిల్లలూ చనిపోయారు. ప్రభుత్వం స్పందించి, వైద్యుడితో సహా ముగ్గురిని సస్పెండ్ చేసింది.