ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెద్దల ప్రమేయం ఉందని సీబీఐ తెలిపింది. బోయినపల్లి అభిషేక్ బెయిల్ ఫిటిషన్ పై ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి ఎంకే నాగ్ పాల్ విచారణ జరిపారు. సీబీఐ న్యాయవాదులు "ఇది హై ప్రొఫైల్ కేసు, కచ్చితంగా దర్యాప్తును ప్రభావితం చేయగలరు, కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని" వాదించారు. ఎఫ్ఐఆర్లో పేరు లేదని, అయినా చాలా సార్లు విచారించిన సీబీఐ, చివరికి అరెస్టు చేసిందని అభిషేక్ లాయర్లు గుర్తుచేశారు.