ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోగాపురం విమానాశ్రయానికి లైన్ క్లియర్: మంత్రి బొత్స సత్యనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 03:38 PM

త్వరలోనే భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పు ద్వారా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి న్యాయపరంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగినట్లేనని ఆయన వెల్లడించారు. భూసేకరణకు సంబంధించి తదుపరి ప్రక్రియ పూర్తి చేయడంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 


ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్నారని, ఆ రోజు భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అంశంలో కోర్టు తీర్పు ఇచ్చిన దృష్ట్యా తదుపరి చేపట్టాల్సిన చర్యలపై విజయనగరం కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. ఇక, విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయాలకు త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ భూ సేకరణలో భాగంగా రైతుల నుంచి పూర్తి స్థాయిలో అంగీకార పత్రాలు తీసుకోవాల్సి ఉందని మంత్రి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com