టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అది ఎన్నటికీ మారదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన దళితుల ఆత్మీయ సదస్సుకు ఆయన విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడుతూ.... చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగినా, దళిత మహిళను వివస్త్రను చేసినా చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. పైగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా... అంటూ దళితులను అవమానించేలా మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు.