నవంబర్ 10వ తేదీ నుండి మైసూర్ నుండి కుప్పం మీదుగా చెన్నైకి ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును సోమవారం ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు చెన్నై నుండి ఉదయం 5-50 గంటలకు ప్రారంభం అయ్యి మధ్యాహ్నం 12-30 గంటలకు మైసూరు చేరుకోనుంది. చెన్నై, జోలార్ పేట, బెంగుళూరు, మైసూరు రైల్వేస్టేషన్లలో మాత్రమే ఈ రైలుకు స్టాపింగ్ ఇవ్వనున్నారు. అయితే మూడు రాష్ట్రల కూడలిలోని కుప్పంలో కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.