విద్యార్థులు విద్యాభివృద్ధి సాధించి నపుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దని గుంతకల్లు జూనియర్ సివిల్ జడ్జి కెవి. రామకృష్ణయ్య అన్నారు. ఆదివారం సాయంత్రం గుంతకల్లు పట్టణంలోని హనుమేష్ నగర్లోని ఎస్సీ, ఎస్టీ బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా న్యాయ మూర్తి మాట్లాడుతూ విద్యార్థినిలు చిన్న వయసులో బాల్య వివాహాలు చేసుకోరదన్నారు. శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామసుబ్బయ్య, న్యాయవాదులు నాగరాజు, బడేసాబ్, హాస్టల్ వార్డెన్లు ఈశ్వరమ్మ, గంగమ్మ పాల్గొన్నారు.