పాకిస్తాన్ లోని కరాచీలో ఆమీర్ గోపంగ్ అనే పోలీసు అధికారి బ్యాంకు ఖాతాలోకి 10 కోట్లు వచ్చి పడ్డాయి, అయితే అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియడం లేదు. తన ఖాతాలో ఇంత నగదు జమకావడంతో షాక్ కు గురయ్యానని, బ్యాంకు సిబ్బంది చెప్తేనే ఇది తెలిసిందని ఆయన అన్నారు. అధికారులు తన ఖాతాను స్తంభింపచేసి, ఏటీఎం కార్డు బ్లాక్ చేసారని తెలిపారు. ఇదే రకంగా మరో ఇద్దరు పోలీసుల ఖాతాల్లోకి 5 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.