ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్ధించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో నలుగురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్ధించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించనట్లు అవదని అభిప్రాయపడ్డారు.