స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన జన్యు వ్యాధి చికిత్సకు ఉపయోగించే జోల్గెన్స్మా (Zolgensma) ఇంజెక్షన్ ధర రూ.16–17 కోట్ల వరకు ఉండటం చర్చనీయాంశమైంది. ఒకే డోసులో ఇచ్చే ఈ జీన్ థెరపీ లోపభూయిష్ట జన్యువుకు బదులుగా ఆరోగ్యకరమైన జన్యువును అందిస్తుంది. అయితే ఈ ఇంజెక్షన్ అంత ఖర్చు ఉండటానికి అధునాతన సాంకేతికత, భారీ పరిశోధన వ్యయాలు, క్లిష్ట తయారీ ప్రక్రియ, విదేశాల నుంచి దిగుమతి వంటివి కారణాలు. అయినప్పటికీ ఇది SMA పురోగతిని నిలిపివేయగల కీలక చికిత్సగా నిపుణులు పేర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa