ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్‌ జార్జ్‌కు ?

international |  Suryaa Desk  | Published : Fri, Apr 03, 2026, 11:41 AM

ఇరాన్ యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అగ్రరాజ్య సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్ తన పదవి నుంచి తక్షణమే వైదొలిగారు. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆదేశాలతో జరిగిన ఈ మార్పు పెంటగాన్ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేవలం ఆర్మీ చీఫ్‌నే కాకుండా.. ఇప్పటికే డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్‌ను పక్కన పెట్టిన హెగ్సెత్.. రక్షణ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధం తీవ్రం అవుతున్న వేళ అమెరికా రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటూ అంతర్జాతీయ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆదేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తనదైన శైలిలో సాయుధ దళాల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే తాజాగా అమెరికా సైన్యాధిపతి జనరల్ ర్యాండీ జార్జ్‌ను పదవి నుంచి వైదొలగాలని హెగ్సెత్ ఆదేశించగా.. ఆయన తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa