-రెయిన్కోట్లు: రెయిన్కోట్లు వాటర్‌ప్రూఫ్ పదార్థంతో తయారవుతాయి. వీటిని మెషీన్లో ఉంచితే, వాటి లోపలి నీరు ఉబ్బి, బెలూన్లా విప్పిపోతుంది. దీనివల్ల బట్టలు పాడవడం మాత్రమే కాకుండా, మెషీన్ బ్యాలెన్స్‌కు కూడా నష్టం కలుగుతుంది.
-ముత్యాలు, స్ఫటికాలు ఉన్న దుస్తులు: ముత్యాలు, పగడాలు లేదా చిన్న అలంకరణలు ఉన్న ఖరీదైన దుస్తులు మెషీన్లో వేయకూడదు. మెషీన్ రొటేషన్ వల్ల అలంకరణలు ఊడిపోతాయి, బట్టలు చెరిగిపోతాయి, పూసలు డ్రమ్‌లో చిక్కి మెషీన్‌ను పాడు చేస్తాయి.
-సున్నితమైన ఉన్ని దుస్తులు: ఉన్ని బట్టలు చాలా మృదువుగా ఉంటాయి. మెషీన్లో ఉతికితే వాటి ఆకారం మార్చిపోతుంది, పొడవుగా మారిపోవచ్చు. అందుకే సున్నితమైన ఉన్ని దుస్తులను తక్కువ సబ్బుతో చేతితో ఉతికడం లేదా డ్రై క్లీనింగ్ చేయించడం మంచిది.
-నూనె, గ్రీజు మరకలు ఉన్న బట్టలు: వంట నూనె, పెట్రోల్, ఆల్కహాల్ లేదా మోటార్ గ్రీజు వంటి ద్రవాలతో ముడిపడి ఉన్న బట్టలను నేరుగా మెషీన్లో ఉంచకూడదు. ఇవి వేడెక్కే స్వభావం కలిగినందున, మెషీన్లో ఉతికితే అగ్ని ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ బట్టలను ముందుగా చేతితో శుభ్రం చేయడం మంచిది.
-ప్యాడ్లు లేదా మెటల్ వైర్లు ఉన్న బ్రాలు: ఖరీదైన ప్యాడ్డ్ బ్రాలు లేదా లోహ వైర్లు ఉన్న దుస్తులు మెషీన్లో వేయకూడదు. రొటేషన్ వల్ల వాటి ఆకారం మారిపోతుంది, వైర్లు బయటకు రావచ్చు, బట్టలు చెరిగిపోవచ్చు మరియు మెషీన్ డ్రమ్‌కు కూడా హానికరంగా ఉంటుంది.
-లేస్ వర్క్ ఉన్న బట్టలు: లేస్ పనిచేసిన సున్నితమైన బట్టలు మెషీన్ ఫోర్స్‌తో తక్కువ కాలంలో చిరగిపోతాయి, బట్టల అందాన్ని నశింపజేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa