సీఎస్‌కే యువ బ్యాటర్, అండర్-19 వరల్డ్‌కప్ విజేత కెప్టెన్ ఆయుశ్ మాత్రే మరోసారి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున హాఫ్ సెంచరీ నమోదు చేసిన అతి పిన్న వయస్కుడిగా అతడు రికార్డు సృష్టించాడు.ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు.ఈ రికార్డు ఇంతకుముందు సురేశ్ రైనా పేరిట ఉండేది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్‌లో రైనా 21 ఏళ్ల 148 రోజుల వయసులో అర్ధశతకం సాధించాడు. ఇప్పుడు ఆయుశ్ మాత్రే కేవలం 18 ఏళ్ల 261 రోజుల వయసులోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో రైనా తర్వాత పార్థివ్ పటేల్ (23 ఏళ్ల 76 రోజులు, 2008) ఉన్నాడు.ఇదే కాకుండా, ఈ హాఫ్ సెంచరీతో మాత్రే మరో ప్రత్యేక ఘనతను కూడా అందుకున్నాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండో అర్ధశతకం. దీంతో 19 ఏళ్లలోపు ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో పృథ్వీ షాతో సమానంగా రెండో స్థానంలో నిలిచాడు.ఈ విభాగంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే అతను మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఇటీవలే 15వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే.మ్యాచ్ పరిస్థితి విషయానికొస్తే.. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే మంచి స్కోర్ దిశగా పయనిస్తోంది. ఆరంభంలోనే సంజూ శాంసన్ (7) వికెట్ కోల్పోయినా, ఆయుశ్ మాత్రే దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు బలమైన పునాది వేశాడు.29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మాత్రే.. మొత్తం 43 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసి ఔటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే స్కోర్ 156/4గా ఉంది. ప్రస్తుతం శివమ్ దూబే (14), సర్ఫరాజ్ ఖాన్ (20) క్రీజ్‌లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa