ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టోల్ ఫీజు క్యాష్ చెల్లింపులకు గుడ్‌బై.. ఏప్రిల్ 10 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 03, 2026, 10:08 PM

వాహనదారులకు పెద్ద అలర్ట్! జాతీయ రహదారులపై టోల్ చార్జీలు చెల్లించడానికి ఇకపై క్యాష్ పేమెంట్లు నిలిపివేయబడ్డాయి. అంటే, టోల్ గేట్ల వద్ద నగదు ద్వారా టోల్ ఫీజులు చెల్లించడం ఇక సాధ్యం కాదు. ఇక టోల్ రుసుము చెల్లించాలంటే కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చేయవలసి ఉంటుంది.నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డిజిటల్ టోలింగ్ వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ఏప్రిల్ 10 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. వాహనదారులు ముందుగా ఈ మార్పులను తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ మార్పు ప్రధానంగా డిజిటల్ ఇండియాను ప్రోత్సహించడం, టోల్ గేట్ల వద్ద వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం, నగదు లావాదేవీలతో వచ్చే స్లోపును తగ్గించడం లక్ష్యంగా తీసుకొచ్చారు.ఏప్రిల్ 10వ తేదీ నుంచి టోల్ ఫీజులు కేవలం ఫాస్టాగ్ లేదా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు ఫాస్టాగ్ ద్వారా చెల్లించాలి. ఫాస్టాగ్ లేని వాహనదారులు యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు చేసుకోవచ్చు. గతంలో కేంద్రం నగదు లావాదేవీలను దశలవారీగా తగ్గించడం ప్రతిపాదించింది. కొద్దిగా క్యాష్ చెల్లింపుల కోసం మాత్రమే ప్రత్యేక లైన్‌లు కేటాయించబడ్డాయి. ఇప్పుడు ఈ విధానం దేశవ్యాప్తంగా 1150కి పైగా టోల్ గేట్లలో పూర్తిగా అమలులోకి వస్తుంది.ఈ మార్పుల వల్ల టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుంది, చెల్లింపులు పారదర్శకంగా జరుగుతాయి, వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణించగలుగుతారు. అలాగే టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ తగ్గడం, మెరుగైన ప్రయాణ అనుభూతి లభించడం వంటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa