ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ దేశాలపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం?

international |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2026, 12:23 PM

పశ్చిమాసియాలో (Middle East War) రోజురోజుకూ రగులుతున్న యుద్ధ జ్వాలలను చల్లార్చేందుకు అగ్రరాజ్యాలైన రష్యా, చైనా ఏకమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులతో హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) సహా గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. శాంతి స్థాపన కోసం ఈ రెండు దేశాలు దౌత్యపరమైన మంతనాలను ముమ్మరం చేశాయి. కేవలం సైనిక చర్యలతో సమస్యలు పరిష్కారం కావని, చర్చల ద్వారానే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుందని ఉద్ఘాటించాయి.రంగంలోకి రష్యా.. పుతిన్ దౌత్యంఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము పూర్తిస్థాయిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. రష్యా ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ మాట్లాడుతూ.. యుద్ధాన్ని (Middle East War) రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకోవాలన్నదే తమ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన ఉద్దేశమన్నారు. ఇందులో భాగంగానే పుతిన్.. గల్ఫ్, అరబ్ దేశాధినేతలతో నిరంతరం టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా గతేడాది అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన రష్యన్-అరబ్ దేశాల కీలక శిఖరాగ్ర సమావేశాన్ని కూడా అతి త్వరలోనే నిర్వహించనున్నట్లు పెస్కోవ్ స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa