నందిగామ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై జరిగిన రాళ్లదాడి ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ బృందం కలవనుంది. వర్ల రామయ్య నేతృత్వంలో ఆరుగురు సభ్యుల టీడీపీ బృందానికి సోమవారం ఉదయం 11:30 గంటలకు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. నందిగామలో చంద్రబాబు ప్రచార రథంపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో చీఫ్ సెక్యూరిటీ అధికారి మధుబాబు గాయపడ్డారు. రాళ్ల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ సభ్యుల బృందం ఫిర్యాదు చేయనుంది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో పాటు జాతీయ స్థాయిలో కట్టుదిట్టమైన రక్షణ కలిగి ఉండే మొదటి పదిమందిలో చంద్రబాబు ఒకరు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా పనిచేయడంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి జరగడం సాధారణమైన విషయం కాదు అని వారు తెలియజేసారు.