టీమిండియా మాజీ సారథులు ధోని, కోహ్లి మధ్య ఉన్న అనుబంధం తెలిసిందే. తాజాగా కోహ్లీ ధోని గురించి మరో విషయం చెప్పాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడినప్పుడు ధోని పంపిన సందేశం తన మనసుని తాకిందని తెలిపాడు. నువ్వు బలంగా ఉండాలి అనుకున్నప్పుడు, ధృడంగా కనిపిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఆడుతున్నావని ప్రజలు అడగరని ధోని చెప్పాడని, ఇది బలంగా తాకిందని, ధోనితో బలమైన బంధం కలిగిఉండటం ఎప్పటికీ మరువలేనని కోహ్లి అన్నాడు.