టిప్పర్ ఢీకొని సెక్యూరిటీ గార్డు మృతిచెందిన ఘటన,పూతలపట్టు మండలంలో చోటుచేసుకుంది. ఆకనంబట్టు గ్రామానికి చెందిన చిరంజీవి(52) చిత్తూరు- తిరుపతి 6లేన్ రోడ్డులోని శరవణ భవన్ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్న టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. ఎస్ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.