ఎస్వీయూ క్యాంపస్ సీఐ రవీంద్రనాథ్ తెలిపిన వివరాల మేరకు.. ఈనెల నాల్గవ తేదీన మల్లంగుంట పంచాయతీ ఎస్టీ కృష్ణారెడ్డి కాలనీకి వచ్చిన కొందరు మద్యం తాగి స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేష్(45), ఆయన సోదరుడు శ్రీనివాస్ అడ్డుచెప్పగా, దాడికి యత్నించారు. గ్రామస్తులంతా ఆ వ్యక్తులపై తిరగబడటంతో వెళ్లిపోయారు. వచ్చినవారెవరో గుర్తించి.. ఈ సంఘటనపై అదేరోజు సాయంత్రం స్థానికులతో కలిసి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? అంటూ మల్లంగుంటకు దళితవాడకు చెందిన విష్ణు, సాయి, గోపి, నారాయణతోపాటు మరొకరు కలిసి ఆదివారం ఆటోడ్రైవర్‌పై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వెంకటే్‌షను రుయాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.