ప్రస్తుతం చాలా మంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆలివ్ ఆయిల్ తో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. జుట్టు బలహీనంగా మరియు రాలిపోతే, కొబ్బరి పాలలో ఒక చెంచా ఆలివ్ ఆయిల్, కొంత కలబంద గుజ్జు మరియు 3 గుడ్ల తెల్లసొన కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తలకు పట్టించాలి. ఇలా చేసిన అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.