ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 02:57 PM

కందుకూరు స్థానిక పోస్టాఫీసు సెంటర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం ఆవరణలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తక్షణం ఆపివేయించేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు సబ్‌కలెక్టరు యస్‌యస్‌ శోభికకు విజ్ఞప్తి చేశారు. పార్టీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నాయకులు సోమవారం గ్రీవెన్స్‌లో సబ్‌ కలెక్టరుని కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తుతో ఖాళీగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ భవనాన్ని స్వాతి ఇంజనీరింగ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వారు లీజుకి తీసుకున్నారని, నిబంధనల ప్రకారంఈ భవనాన్ని మాత్రమే వాడుకుని నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉండగా, ప్రహరీని కూల్చివేయటంతోపాటు భవనం సెట్‌బాక్స్‌ కింద వదిలిన స్థలంలో పడమర, దక్షిణం వైపున షాపింగ్‌ కాంప్లెక్స్‌ అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, ఇప్పటికే ఫిల్లర్లు కూడా వేశారని తెలిపారు. సెట్‌బ్యాక్స్‌లో ఎలాంటి నిర్మాణాలు చేయకుండా మున్సిపల్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com