ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 4 బిలియన్ డాలర్ల విలువైన 19.5 మిలియన్ టెస్లా షేర్లను విక్రయించారు. యూఎస్ సెక్యూరిటీ ఫైలింగ్స్ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. ఇటీవలే ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అందుకు 44 బిలియన్ డాలర్లు (రూ.4400 కోట్లు) వెచ్చించారు. ఈ నేపథ్యంలో మస్క్ తాజాగా తన మరో కంపెనీ టెస్లా షేర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.