హిందూ మహాసముద్రంపై ఉపరితల ఆవర్తనం కారణంగా నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 11, 12 న రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa