చెన్నైలో కరుణాకరన్ (75)-పద్మావతి (66) దంపతులకి తరచూ గొడవలు జరిగేవి. నవంబర్ 7న కరుణాకరన్ బిర్యానీ పొట్లం కొని భార్యకు పెట్టకుండా ఒక్కడే తిన్నాడు. తనకూ బిర్యానీ కావాలని భార్య అడగడంతో ఇద్దరూ వాదించుకుంటూ గొడవ పడ్డారు. కోపంతో ఉన్న భర్త, ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వెంటనే భార్య పరిగెత్తుకుంటూ వచ్చి, భర్తను హత్తుకోవడం వల్ల ఇద్దరూ మంటల్లో కాలిపోయారు.