రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు దర్యాప్తునకు సంబంధించి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం తాజా సమన్లు జారీ చేసారు.మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనల ప్రకారం సిఎం సోరెన్‌ను వచ్చే వారం నవంబర్ 17న రాంచీలోని ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా కోరింది.