ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓ మహిళా రోగిని ఓ వైద్యుడు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైద్యుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్బా జిల్లాలోని మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడైన డాక్టర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు డాక్టర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు జిల్లా వైద్య కళాశాల డీన్ డాక్టర్ అవినాష్ మెష్రామ్ తెలిపారు.