ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ సభకు హాజరయ్యేందుకు పది వేల మందికి వీఐపీ పాస్‌లను జిల్లా యంత్రాంగం జారీ చేసింది. మరో ఐదు వేల మంది అధికారులు, సిబ్బందికి పాస్‌లు ఇచ్చారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, 25 మంది డిప్యూటీ కలెక్టర్లు, 53 మంది జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ప్రధాన వేదిక వద్దకు ఎక్కువ మందికి పాస్‌లు ఇవ్వవద్దని ప్రధాని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు అభ్యంతరం వ్యక్తంచేస్తోం ది. వీరు కాకుండా 6, 500 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాట్లలో ఉన్నారు.