ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. తన భార్యను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పోదల్లోకి విసిరేశాడో భర్త. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నేరం అంగీకరించాడు. ''నా భార్యను చంపేశాను. శవం దగ్గరకు తీసుకుని వెళ్తా.. పదండి'' అని నిందితుడు పోలీసులతో చెప్పడం గమనార్హం. భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.