ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణ ఆపాలని సీపీఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున శుక్రవారం డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ప్రధాని మోదీ ఏపీకి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఆపార్టీ రూరల్ మండల నాయకులు కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. రూరల్ పరిధిలో నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నరేంద్రమోడీ గో బ్యాక్ అంటూ నిరసన ర్యాలి చేపట్టారు.