విశాఖలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ 'ఏపీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదు. ఏపీని తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాని మోడీతో అనుబంధం పార్టీలు, రాజకీయాలకు అతీతం. స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు చాలా విజ్ఞప్తులు చేశాం' అని అన్నారు.