విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక సంఘాల నాయకులు పోరాడుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తారా అంటూ అనంతపురంలో ఎఐటియుసి, సిఐటియు నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కార్మికులతో కలసి శనివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, నాగేంద్ర లు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని. కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడం మంచిది కాదన్నారు.