ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ రెడ్డి ముస్లిం మైనారిటీల ద్రోహి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 04:48 PM

వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం, అభివృద్ధి చెందారని గొప్పలు చెబుతున్న సీఎం జగన్ రెడ్డి ముస్లిం, మైనారిటీలకు తీరని ద్రోహం చేశాడని టిడిపి ముస్లిం, మైనారిటీ నాయకులు విమర్శించారు. శని వారం గుంతకల్లు పట్టణంలో తిలక్ నగర్ లోని మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడు క్యాంపు కార్యాలయంలో ముస్లిం, మైనారిటీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశామని గొప్పలు చెబుతున్నది అంతా మోసం అన్నారు. ఇప్పటికీ మైనారిటీ ఫెడరే షన్ కు సంబందించిన రుణాలు ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. అదే చంద్రబాబు నాయుడు హయాంలో మైనారిటీ లకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా అన్ని రకాల రుణాలు అందయన్నారు. మోసపూ రిత మాటలతో తమ వర్గం ప్రజలను మభ్యపెడుతున్నాడని అన్నారు.


ఈ సమావేశంలో మహమ్మద్ షరీఫ్, షేక్ ఫజులు, రంజాన్, ఫ్రూట్ మస్తాన్, ఇస్మాయిల్, ఆటో ఖాజా, బంధా నవాజ్, అతిక్ అహ్మద్, మన్సుర్ అలీ ఖాన్, పామిడి ఖలీల్, యూసుఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com