తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జోన్-3 స్థాయి తెలుగు రైతు సమావేశం రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. జోన్-3లో ఎన్టీఆర్, కృష్ణ , బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట జిల్లాల్లోని రాష్ట్ర తెలుగు రైతు కార్యవర్గం, జిల్లా రైతు అద్యక్ష కార్యదర్శులు, నియోజకవర్గ రైతు అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం నిర్వహించటమైనది. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సంవత్సరం జూన్ 14వ తేదీన జగన్‌రెడ్డి బటన్ నొక్కిన క్రాప్ ఇన్సూరెన్స్ డబ్బులు నేటీకీ లబ్ధిదారులకు చేరలేదు.
వైసీపీ ప్రభుత్వ విధానంతో ఆక్వా రంగం కుదేలు. రాష్ట్రానికి విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రూపాలలో ఆదాయాన్ని అందించడమే కాకుండా 20 లక్షల జనాభా వరకు ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగం వైసీపీ ప్రభుత్వ విధానంతో కుదేలు అయింది అన్నారు .
వ్యవసాయ మోటార్లకు మీటర్లు రైతు మెడకు ఉరితాళ్లే. వేలకోట్ల దోపిడీకి జగన్‌రెడ్డి పన్నాగం. వ్యవసాయ మోటర్లకు మీటర్లు రైతు మెడకు ఉరితాళ్లే అని గతంలోనే మన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నినదించారని అంటే దాని తీవ్రత ఏపాటిదో అందరికీ విదితమే, అయినా రైతు ద్రోహి జగన్‌రెడ్డి మోటార్లకు మీటర్లు పెట్టే తీరుతామని తన తాబేదారు కంపెనీకి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణ అప్పజెప్పడం ద్వారా వేలకోట్ల దోపిడీకి తెరతీయడమే కాకుండా భవిష్యత్‌లో రైతులను తమ భూముల నుండి తరిమివేసే కుట్రలకు పథక రచన చేస్తున్నారని ఆరోపించారు.
రైతాంగం ఎదుర్కొంటున్న సాగు నీటి సమస్య, గిట్టుబాటు ధరల సమస్య, పంట నష్టపరిహారం సమస్య మరియు ఇతర ప్రాంతాల్లోని సమస్యలపై తక్షణం స్పందించాలని రైతు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమాల షెడ్యూల్ ప్రకటించిన క్రాప్ ఇన్సూరెన్స్ లబ్ధిదారులందరికీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ 28. 11. 2022న రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన, ఆక్వా రంగంలో సమస్యల పరిష్కారం కోరుతూ 12. 12. 2022న ఫిషరీస్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన, వ్యవసాయ మీటర్లకు మీటర్లు బిగింపు ప్రక్రియ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రికల్ ఎస్‌ఈ కార్యాలయాల వద్ద 26. 12. 2022 (సోమవారం)న నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ మిర్చి పంట వేరుగుళ్లు తెగులుతో పైరు ఎండిపోతోంది.పత్తి పంట అధిక వర్షాల వల్ల పిందె రాలిపోయి దిగుబడి తగ్గిపోయింది ఈ రెండు పంటలను సర్వే చేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శులు కుర్రా నరేంద్ర, శివసాంబిరెడ్డి, అగస్టీన్, ఉపాధ్యక్షులు గద్దె వెంకటేశ్వర ప్రసాద్, నూతలపాటి రామారావు, పమిడి భాస్కరరావు, కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గోపు సత్యన్నారాయణ, వీరారెడ్డి మరియు జిల్లా తెలుగు రైతు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.