ప్రభుత్వ భూదాహానికి అడ్డుపడుతున్నారని, ముదపాక ల్యాండ్ పోలింగ్ కి అడ్డుపడుతున్నారని ఒకే ఒక కారణంతో సోమేశ్ కుటుంబాన్ని శత విధాలుగా ఇబ్బందులకు గురిచేసి చివరికి ఆరోజు సోమేశ్ ఆత్మహత్య కారణమైన వైఎస్ఆర్సిపి నాయకులు పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడం వల్ల ఆ కుటుంబాన్ని మరింత వేధింపులు గురిచేసి ఈరోజు సోమేశ్ గారి సహోదరి అనుమానాస్పద రీతిలో ఒక నూతిలో శవమై తేలడం పలు అనుమానాలకి తావిస్తుంది, సోమేశ్ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ చావుకి కారణాలు తెలిసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రతి ఒక్కరూ ఈరోజు 10 గంటలకు KGH లో గల మార్చురీ దగ్గరకు చేరుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా తెలియజేస్తున్నాం అని టీడీపీ నాయకులూ బండారు అప్పల్నాయుడు పిలుపునిచ్చారు.