రాష్ట్రంలో వైద్య రంగానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి విడదల రజిని తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం రజిని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల కోసం ప్రతియేటా 13వేల కోట్ల రూపాయలు కేటాయిస్తుందని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంటే. చంద్రబాబు మాత్రం దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు