టర్కీలోనిి ఇస్తాంబుల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ముస్లిం మత ప్రబోధకుడు అద్నాన్ అక్తర్ కు టర్కీలోని ఇస్తాంబుల్ కోర్టు ఏకంగా 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 66 ఏళ్ల అద్నాన్ అక్తర్ టీవీ షోలలో భారీ మేకప్, పొట్టి దుస్తులు ధరించిన మహిళల మధ్య కూర్చొని చర్చలు నిర్వహించేవాడు. మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, మిలిటరీపై గూఢచర్యం తదితర కేసుల్లో ఆయనకు గత ఏడాదే కోర్టు 1,075 ఏళ్ల శిక్షను విధించింది. అయితే పైకోర్టు ఈ తీర్పును కొట్టివేసింది. ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు ఈ కేసును విచారించింది (రీట్రయల్). ఆయనతో పాటు ఆయన అనుచరులు మరో 10 మందికి 8,658 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2018లో ఈయనను అరెస్ట్ చేశారు.