కర్నూలుకు న్యాయ రాజధాని వద్దని వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని కర్నూలు వచ్చారని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ నిలదీశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు చేసింది చంద్రబాబు కదా అని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తుంటే దిక్కుమాలిన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అడ్డుతగుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పుట్టి..ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. కర్నూలులో హాఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.