కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిషిత్ ప్రామాణిక్ పై అరెస్టు వారెంట్ జారీ అయింది. 2009నాటి నగల చోరీ కేసుకు సంబంధించి బెంగాల్ లోని అలీపూర్ దువార్ జిల్లా కోర్టు వారెంట్ జారీ చేసింది.ఈ కేసు విచారణ చివరి రోజున కోర్టుకు ఇతర నిందితులు హాజరుకాగా, నిషిత్ తరపు న్యాయవాది హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. నిషిత్ 2019లో బీజేపీ టికెట్ పై గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.