కంచే చేను మేసింది అన్న చందంగా అక్రమ దందాలను అరికట్టాల్సిన పోలీసులే వాటిలో పాలుపంచుకుంటున్నారు. మహారాష్ట్రలో ఇద్దరు రైల్వే కానిస్టేబుళ్లు డ్రగ్స్ దందా చేస్తూ అధికారులకు దొరికిపోయారు. కళ్యాణ్ GRP కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను యాంటీ నార్కోటిక్స్ సెల్ అరెస్టు చేసింది. వీరివద్ద నుండి 921 గ్రాముల చరస్ స్వాధీనం చేసుకుంది. వీరిపై ఎన్డిపిఎస్ చట్టం కింద బజార్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.