ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్మిషన్ లేకుండా వెళ్తున్న ఓ పారాగ్లైడర్ హైటెన్షన్ విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. ఘటనలో అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే ప్రమాదసమయంలో తీగలకు విద్యుత్ సరఫరా లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. మథుర జిల్లాలోని గోవర్ధన్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ పారాగ్లైడర్‌లో ఓ మహిళతో పాటు పైలట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa