ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో కాస్త లావుగా ఉన్న మస్క్, ఇటీవల స్లిమ్ గా మారారు. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా 13 కిలోల బరువు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. ఓ స్నేహితుడి సలహాతో బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానని, ఆహారాన్ని మితంగా తీసుకోవడంతో పాటు తనకు ఇష్టమైన పదార్థాల జోలికి వెళ్లలేదని మస్క్ తెలిపారు. దీంతో నెటిజన్లు మస్క్ పై ప్రశంసలు గుప్పిస్తున్నారు.