తమ దేశం ఎదుర్కొంటున్న సమస్యలలో ఉగ్రవాదం ప్రధానమైందని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వాలో పోలీస్ వ్యాన్ పై జరిగిన ఉగ్రదాడిని ఆయన ఖండిస్తూ దాడిలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ఉగ్రదాడిని ఖండించడానికి మాటలు రావడంలేదని, దేశాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న పోలీసులు, సైనికులను ఆయన కొనియాడారు.