ఓ యాచకుడిని గుర్తు తెలియని వ్యక్తులు తలపగులగొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన తిరుపతి ఎస్వీయూనివర్శిటీ సమీపంలోని బస్సు స్టాప్ లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బస్సు స్టాప్ లో హత్య గురించి సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి జేబులో ఆధార్ కార్డు లభించింది. అందులోని వివరాల ప్రకారం పేరు లక్ష్మణరావు (77), విజయవాడకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అలాగే రాణి, అల్లుడు సుబ్బారావు అని, ఫోన్ నెంబర్ రాసిఉన్న చీటీకూడా దొరికింది. లక్ష్మణరావుకు ముగ్గురు పిల్లలకూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఐతే ఎవరు ఆయనను హత్య చేశారనే విషయం తెలియరాలేదు. బంధువులకు పోలీస్ లు సమాచారం అందించారు. డబ్బు కోసం ఈ హత్య జరిగిందా? లేదా బంధువుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.