దోచుకునేందుకు దుండగులు రోజురోజుకు సరికొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తకు నకిలీ ఈడీ సమన్లు పంపి, అతని వద్దనుండి భారీగా నగదు వసూలు చేశారు. ఈ నేరానికి పాల్పడిన అస్సాం రైఫిల్స్ హెడ్ కానిస్టేబుల్ సహా తొమ్మిది మంది ముఠాను క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాదితో పాటు, మరికొందరిని త్వరలో అరెస్టు చేస్తామని క్రైం సీపీ రవీంద్ర యాదవ్ తెలిపారు.