ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్య...ఆపై మరణించిన భార్యకు నివాళ్లి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 17, 2022, 10:09 PM

ఏపీలో ధారుణ ఘటన చోటు చేసుకొంది. గుంటూరు జిల్లా తెనాలి టౌన్ లో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను చంపి, సంఘటన స్థలంలోనే ఆమెకు నివాళులు అర్పించడం సంచలనం సృష్టించింది. కోటయ్య, కాకర్ల స్వాతి దంపతులు తెనాలిలోని నాజర్ పేటలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. స్వాతి గాంధీనగర్ లో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతోంది. అయితే, స్వాతి ప్రవర్తనపై భర్త కోటయ్య కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో, నేడు మధ్యాహ్నం మద్యం మత్తులో కోటయ్య భార్య స్వాతితో గొడవపడ్డాడు. బ్యూటీపార్లర్ వస్తూనే కత్తి, ఓ పూలదండ కూడా తీసుకునివచ్చాడు. 


ఘర్షణ పెరిగిపెద్దదవడంతో కోటయ్య తీవ్ర ఆగ్రహంతో స్వాతిని కత్తితో నరికి చంపాడు. అనంతరం, ఆమె మృతదేహంపై పూలదండ వేసి నివాళులు అర్పించాడు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. కోటయ్య తీరుతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ హత్య అనంతరం కోటయ్య తెనాలి రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com