తమ జీవిత కాలంలో సొంత ఇల్లు కట్టుకోవాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అయితే బెంగాల్ లోని ఓ వ్యక్తి మాత్రం తన భార్య లేదనే బాధతో 25 ఏళ్లుగా వెదురు చెట్లపైనే భిన్నమైన జీవితం గడుపుతున్నాడు. పూర్వ బర్దమాన్ జిల్లా.. కత్వా సమీపంలోని పాలిత్ పుర్ కి చెందిన లోకు రాయ్ భార్య 25 ఏళ్ల క్రితం అగ్ని ప్రమాదంలో మరణించగా మానసిక స్థైర్యాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలో ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ తోటను పెంచుతూ వెదురు చెట్లపైనే జీవిస్తున్నాడు.