ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ వచ్చే ఏడాది మార్చిలో భారతదేశంలో పర్యటిస్తానని ప్రకటించారు. భారతదేశం, ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందాన్ని లాక్ చేయడానికి ఇంకా ఇరుదేశాల మధ్య సంబంధాలను బలపర్చేందుకు ఈ పర్యటన చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని, భారతదేశం, ఆస్ట్రేలియా మధ్య సన్నిహిత ఆర్థిక సహకార ఒప్పందాన్ని ఖరారు చేయడం గురించి చర్చించామని ఆయన తెలిపారు.